ఇప్ప సారా... మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఇప్పపువ్వుతో చేసే సారా ఆర్గానిక్ అన్న అనిరుద్ రెడ్డి
  • ఇప్పపువ్వు అడవిలో సహజంగా లభిస్తుందన్న ఎమ్మెల్యే
  • ఇప్పసారాతో ప్రపంచ మార్కెట్‌లో పెటీపడవచ్చన్న అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పపువ్వుతో చేసే సారా ఆర్గానిక్ అని, ఇది ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. అసెంబ్లీలో దీనిని ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం చివరకు ఏది సరైనదో అదే చేస్తుందని అన్నారు. ఇప్పపువ్వు అడవిలో సహజంగా లభిస్తుందని ఆయన తెలిపారు. దీనితో మనం ప్రపంచ మార్కెట్‌లో కూడా పోటీ పడవచ్చని అన్నారు.

మెక్సికో టకీలా డ్రింక్, ఫ్రాన్స్‌ కొనియా డ్రింక్‌ను తయారు చేసి ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే తాను ఇప్పసారాపై పూర్తి నివేదిక సిద్ధం చేసుకున్నానని అన్నారు. ఇప్పసారా వల్ల కలిగే లాభ నష్టాల గురించి అసెంబ్లీలో మాట్లాడతానని తెలిపారు.

గతంలో ఇప్పసారా తాగిన వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 110 ఏళ్లు బతికారని అన్నారు. కానీ ఇప్పుడు మద్యం తాగి అరవై ఏళ్లు కూడా ఆరోగ్యంగా బతకడం లేదని అన్నారు. ఇప్పపువ్వు సారాను మార్కెట్ చేస్తే ఆదివాసీలు, ఎస్టీలకు జీవనోపాధి దొరుకుతుందని అన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం లభిస్తుందని అన్నారు.

Anirudh Reddy
Ippa Sara
Ippa flower liquor
Telangana politics

More Telugu News